
పోషక లోప నివారణ.. ఆరోగ్య రక్షణ
నిత్యం కార్యక్రమాలు
ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రోజుకో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణి, పాలిచ్చే తల్లులు, శిశువులు, చిన్నపిల్లల పోషణపై సలహా సమావేశం, పౌష్టికాహారం తయారీపై వంటకాల పోటీలు, కిశోర బాలికలకు, పెద్దవాళ్ల కోసం బీఎంఐ పరీక్షలు, పిల్లల కోసం ఎత్తు, బరువు, కొలతలు తీయడం, ఆహారంలో చెక్కెర, నూనె వినియోగాన్ని తగ్గించే విషయంపై అవగాహన కల్పించనున్నారు. తండ్రులతో పోషకాహార ప్రతిజ్ఞ, 3 ఏళ్లలోపు పిల్లల ఆరంభ అభివృద్ధి, స్థానిక ఉత్పత్తులు, బొమ్మలపై అవగాహన కల్పిస్తారు. వంటకాలు స్వయంగా తయారు చేయడం, బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టడంపై, ఆహారపు అలవాట్లు అలవర్చుకునేలా వివరిస్తారు. ఆరోగ్యవంతమైన పిల్లలు, తల్లులు, పోషణ లోపం ఉన్న వారి మధ్య అనుభవం పంచుకోవడం, చిరు ధాన్యాలు, ఫలాలు, కూరగాయలపై , అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలకు పరీక్షలు, రక్తహీనత, అధిక బరువు వల్ల వచ్చే సమస్యలపై కిశోర బాలికలకు అవగాహన చేపట్టనున్నారు.
నిర్వహణకు ఏర్పాట్లు
జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం నిత్యం ఓ కార్యక్రమం నెల పాటు నిర్వహిస్తాం. చిన్నారులు, మహిళలకు ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కల్పించనున్నాం.
– లలితకుమారి, ప్రాజెక్టు డైరెక్టర్,
సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, సంగారెడ్డి
చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగు పర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పోషణ మాసంలో ప్రజాప్రతినిధులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులకు ఆ శాఖ ద్వారా లేఖలు కూడా పంపించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహించనున్నారు. పోషణ మాసం సందర్భంగా చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు, పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
17 నుంచి పోషణ మాసం షురూ..
చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై
ప్రత్యేక శ్రద్ధ
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహణ
నెల రోజులపాటు నిత్యం ఓ కార్యక్రమం

పోషక లోప నివారణ.. ఆరోగ్య రక్షణ

పోషక లోప నివారణ.. ఆరోగ్య రక్షణ