
బ్యాడ్మింటన్‌లో సత్తా చాటిన జట్టు
మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ నెల 12 నుండి 14 వరకు జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం కూనూరులో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో ఖమ్మం జిల్లా జట్టును ఓడించి మెదక్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ట్రోఫీతో పాటు బహుమతులు ప్రదానం చేశారని ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ ిపీవీ.రమణ, ట్రెజరర్ శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శరణప్ప తెలిపారు.