
గడికోట.. గత వైభవానికి ప్రతీక
పెద్దశంకరంపేటలోని గడికోట
పెద్దశంకరంపేట: శతాబ్దాల చరిత్రకు నాటి కళాత్మకతకు, ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం పెద్దశంకరంపేట గడికోట. 400 ఏళ్ల క్రితం 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ కోట ఇప్పటికీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పెద్దశంకరంపేట గ్రామంలో ఉన్న ఈ కోటను 1764లో రాణి శంకరమ్మ కట్టించినట్లు ఆధారాలున్నాయి. నిజాం పాలనలో అతిపెద్ద సంస్థానాలుగా ఉన్న పెద్దశంకరంపేట, పాపన్నపేటలను రాజధానిగా చేసుకొని శంకరమ్మ, వారి వారసులు పాలించారు. ఈ కోటను చతురస్రాకారంలో, నాలుగు బురుజులతో నిర్మించారు. దీనిలో గురప్రు, ఎనుగు శాలలు ఉన్నాయి. కోటలోని ఫిరంగులను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేశారు.