
తీగలు.. తెగిపడితే తిప్పలే
సదాశివపేట(సంగారెడ్డి): విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా ఉన్న టీవీ, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు వాహనచోదకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కేబుల్ వైర్లు తెగిపడి పలువురు వాహనదారులు ప్రమాదానికి గురైన ఘటనలున్నా చర్యలు చేపట్టాల్సిన విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సదాశివపేటలో 2,500 విద్యుత్ స్తంభాలు, 400 ట్రాన్స్‌ఫార్మర్లు, 25,000 విద్యుత్ కనెక్ష న్లున్నాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా క్రమపద్ధతిలో కేబుల్ వైర్లు అమర్చాల్సి ఉండగా నిబంధనలు ఉల్లంఘిస్తూ కేబుల్‌వైర్లు ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు లేదా మరమ్మతులు చేయాల్సి వచ్చి స్తంభాలు ఎక్కేటప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
తొలగించాలని ఆదేశించాం
పలుచోట్ల విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు విద్యుత్ ఉద్యోగులు స్తంభాలు ఎక్కడానికి కేబుల్ వైర్లు అడ్డంకిగా మారుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని సంబంధిత కేబుల్ ఆపరేటర్లకు తెలియజేశాం.
–మధుసూదన్‌రెడ్డి, ఏఈ ట్రాన్స్‌కో, సదాశివపేట

తీగలు.. తెగిపడితే తిప్పలే