
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొండపాక(గజ్వేల్): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రవీంద్రనగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవీంద్రనగర్ గ్రామానికి చెందిన నాలగం కనకయ్య(40) బీడీ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శుక్రవారం పని ఉండడంతో తన ఇంటిపైకి వెళ్లాడు. బిల్డింగ్‌పైన ఉన్న డిష్ వైర్‌ను సరిచేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుకునూర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.