
లైంగిక వేధింపుల నివారణకు..
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పోష్ చట్టంతో పాటు షీ–బాక్సు పోర్టల్‌ను తప్పకుండా అమలు చేయాలని డీడబ్ల్యూఓ హేమభార్గవి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో సురక్షితమైనవిగా ఉండేలా 2013లో భారత ప్రభుత్వం వీటిని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేకుండా ఉండేందుకు అంతర్గత ఫిర్యాదుల పరిష్కారానికి షీ– బాక్స్ పెట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని వివరించారు. దీనికి సంబంధించి కమిటీ సభ్యుల వివరాలను సమర్పించడానికి 10 మంది అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ షీ–బాక్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాన్ని ప్రారంభించిందని తెలిపారు. దీని ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగులు, సిబ్బంది నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 181 ఫిర్యాదు, సహాయానికి సంప్రదించాలని కోరారు.
జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి
హేమభార్గవి