
3787 కేసులు పరిష్కారం
లోక్ అదాలత్‌లో
సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల విలువైన సమయం, డబ్బులు ఆదా అవుతుందన్నారు. రాజీ చేసుకోదలచిన క్రిమినల్, గృహహింస, చెక్ బౌన్స్, మోటారు ప్రమాద కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లో 3,733 క్రిమినల్, 39 సివిల్, 15మోటారు ప్రమాద కేసులతో పాటు మొత్తం 3,787 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. మోటారు ప్రమాద కేసుల్లో బాధితులకు రూ.1కోటి75వేలు బాధితులకు ఇప్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్‌కాంబ్లి, సంతోష్‌కుమార్, సాధన, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, న్యాయవాదులు సత్యనారాయణ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి