
జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ
సిద్దిపేటకమాన్: భారతదేశంలో ఒకటే పన్ను విధానం ఉండాలని జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ అని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో వర్తక, వాణిజ్య వ్యాపారస్తులతో జీఎస్టీపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. అప్పట్లో పదేండ్లు పాలించిన కాంగ్రెస్ జీఎస్టీ బిల్లును ఎందుకు పాస్ చేయలేకపోయిందని ప్రశ్నించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీవీ, ఫ్రిడ్జ్, కార్లు, పన్నీరు, పిండిపదార్థాలు, డైరీ ఉత్పత్తులు వంటి 85వస్తువులపై ధరలు తగ్గనున్నట్లు తెలిపారు. ఓటు, నోటు చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులేనని చెప్పుకొచ్చారు. దేశంలో ఒక కోటి 51 లక్షల మంది జీఎస్టీ చెల్లిస్తున్నారన్నారు. 173దేశాల్లో ఏ ప్రధాని కూడా చేయని విధంగా 11ఏళ్ల నుంచి మన దేశానికి మోదీ ప్రధానిగా చేస్తున్నారన్నారు. దేశంలో 11 ఏళ్లలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు, వ్యాపారస్తులు గంప కృష్ణ, భూపతి, వీరేశం, సత్యనారాయణ, సుతారి కార్తీక్ పాల్గొన్నారు.
అవగాహన సదస్సులో
ఎంపీ రఘునందన్‌రావు
కాంగ్రెస్ పాలనలో
బిల్లు ఎందుకు పాస్ కాలేదు

జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ