
యూరియా ‘బ్లాక్’!
పరిగి: యూరియా కోసం ఓ వైపు రైతులు పడరాని పాట్లు పడుతుంటే ఫర్టిలైజర్ దుకాణదారులు మాత్రం బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిపూట అధిక ధరలకు అమ్ముతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ కేంద్రంలోని చిన్నారి ఆస్పత్రి పక్కన ఉన్న గోదాం నుంచి శనివారం రాత్రి దుకాణదారుడు యూరియాను ఆటోలో తరలిస్తుండగా ఓ రైతు వీడియో తీసి వాట్సప్‌లో వైరల్ చేశాడు. ఒక్క బస్తా కోసం పగలురాత్రి తేడాలేకుండా తాము లైన్‌లో నిలబడినా, స్టాక్ అయిపోందని వెనక్కి పంపిస్తూ.. ఇలా రాత్రి వేళ బ్లాక్ మార్కెట్‌కు తరలించడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.