
డబ్బుల విషయంలో వివాదం
● పన్నెండేళ్ల తర్వాత అన్నాచెల్లెలు రాజీ
● లోక్‌అదాలత్‌లో కేసు పరిష్కారం
గజ్వేల్‌రూరల్: డబ్బుల విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో కేసులు నమోదు చేసుకున్న అన్నాచెల్లెలు పన్నెండేళ్ల తరువాత లోక్ అదాలత్‌లో రాజీ పడ్డారు. గజ్వేల్ సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... 2012 జూలై 29న నాసిరుద్దీన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులకు తండ్రి అబ్దుల్ నబీ దుబాయ్ నుంచి పంపించిన డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. 12ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. శనివారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో జడ్జీ స్వాతిగౌడ్ ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చారు. ఈ కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుల్ రవికుమార్, పీపీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పొలానికి వెళ్లొస్తుండగా..
ఆటో ఢీకొట్టడంతో రైతు మృతి
కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందాడు. మండలంలోని కృష్ణాపూర్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్డి గ్రామానికి చెందిన చింతల భూమయ్య(35) టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పనులు ముగించుకొని కృష్ణాపూర్‌కు వెళ్లి, తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో అతడిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భూమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య బాలమణి, కూతురు అంజలి, కొడుకులు ప్రసాద్, గణేశ్ ఉన్నారు.
విద్యార్థి అదృశ్యం
జహీరాబాద్ టౌన్: విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. టౌన్ ఎస్‌ఐ.వినయ్‌కుమార్ కథనం ప్రకారం... పట్టణంలోని మోమిన్ మొహల్లాకు చెందిన ఇస్మాయిల్ కుమారుడు ఎండీ అర్బాస్(17) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ నెల 12న మార్కెట్‌కు వెళతానని చెప్పి తిరిగి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అన్న ముబీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో చోట వివాహిత..
పటాన్‌చెరు టౌన్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎంజీ రోడ్డుకు చెందిన శ్రీనివాస్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12న భార్య స్వరూప శ్రీనివాస్ గొడవ పడ్డారు. అదేరోజు సాయంత్రం శ్రీనివాస్ వాష్ రూమ్‌కి వెళ్లి వచ్చేసరికి భార్య ఇంటి నుండి వెళ్లిపోయింది. వెంటనే భార్య కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు.

డబ్బుల విషయంలో వివాదం

డబ్బుల విషయంలో వివాదం