
చేనేత హస్తకళ ప్రదర్శన
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో చేనేత హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. చేనేత వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, జైపూర్ స్టోన్స్, ఉడెన్ హ్యాండ్ క్రాఫ్ట్‌స్ ఒడిశా పెయింటింగ్ తదితర ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకున్నాయి.
చేగుంట(తూప్రాన్): మండలంలోని కరీంనగర్ అటవీ ప్రాంతంలో మేకలతో పాటు కాపరి రాజుపై చిరుత దాడి చేసిన స్థలాన్ని ఫారెస్టు అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి చిరుత దాడి చేసిన ప్రదేశానికి వెళ్లిన అటవీశాఖ అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజు ఇంటికి వెళ్లి పరిశీలించారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు, మేకల కాపరులు ఒంటరిగా అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దన్నారు. ఒకవేళ చిరుత ఆనవాలు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ పరిశీలనలో సెక్షన్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ రవికిరణ్‌తో పాటు గ్రామస్తులు ఉన్నారు.
పటాన్‌చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పోచారానికి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళకు పురటి నొప్పులు రా వడంతో 108 వాహ నంలో తరలిస్తున్నా రు. మార్గమధ్యలోకి రాగానే నొప్పులు అధికం కావడంతో సిబ్బంది ప్రసవం చేశారు. దీంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ధరిపల్లిలో అక్రమంగా ఇసుకు తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్‌లను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ నారాయణగౌడ్ తెలిపారు. ధరిపల్లి శివారులోని వాగునుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచరం మేరకు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ట్రాక్టర్లను సీజ్‌చేసీ కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
దుబ్బాకరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ హరీశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పుసుకూరి సతీశ్ పలు గ్రామాల్లో ప్రతి ఇల్లు తిరిగి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నాడు. వాటిని ఎక్కువ ధరకు కోళ్ల ఫారాలకు ట్రాక్టర్‌లో తరలిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ట్రాక్టర్‌ను గ్రామ శివారులో పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మిరుదొడ్డి ఎంఎల్‌సీ పాయింట్‌కు, ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సివిల్ సప్‌లై డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

చేనేత హస్తకళ ప్రదర్శన

చేనేత హస్తకళ ప్రదర్శన

చేనేత హస్తకళ ప్రదర్శన