
కార్లు అద్దెకు తీసుకుని..
సిద్దిపేటకమాన్: కార్లు కిరాయికి తీసుకుని విక్రయిస్తున్న ముఠాలో ఒక సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన సమీర్ తన వద్ద రంగారెడ్డి జిల్లా చర్లపటేల్ గూడకు చెందిన పట్నం నరేశ్ కారును అద్దెకు తీసుకెళ్లి తిరిగి ఇవ్వడం లేదని ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నరేశ్, చిన్నకోడూరుకు చెందిన మిద్దెల మహేశ్, రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శేఖర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మాతృ, నల్గొండ జిల్లాకు చెందిన సంతోష్ ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా కార్లను అద్దెకు తీసుకుని, తాకట్టు పెట్టడం, కొన్నింటిని విక్రయించి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఆరు నెలలుగా సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి ప్రాంతాల్లో 17 కార్లు కిరాయికి తీసుకుని విక్రయించారు. నిందితుడు నరేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.
విక్రయిస్తున్న ముఠాలో ఒకరి అరెస్టు
ఆరు కార్లు స్వాధీనం..