
వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలి
యువశాస్త్రవేత్తలకు అవగాహన కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ గోపాల్‌లాల్
చిలప్‌చెడ్(నర్సాపూర్): వ్యవసాయాభివృద్ధికి యువశాస్త్రవేత్తలు కృషి చేయాలని ఐసీఏఆర్ డైరెక్టర్ గోపాల్‌లాల్ తెలిపారు. మండలంలోని శిలాంపల్లిలో కౌడిపల్లి మండలం తునికి కేవీకే, ఐసీఏఆర్ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నామ్(నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ మేనేజ్‌మెంట్) ఆధ్వర్యంలో శుక్రవారం 115వ వ్యవసాయ పరిశోధన శిక్షణ కార్యక్రమంలో భాగంగా 22రాష్ట్రాలకు చెందిన 107మంది యువశాస్త్రవేత్తలకు వ్యవసాయంపై అవగాహన, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోపాల్‌లాల్ మాట్లాడుతూ...వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు యువశాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను రైతులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు క్షేత్రపర్యటన నిర్వహించి రైతులతో మాట్లాడారు. సాగు పెట్టుబడులు, నీటియాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, దిగుబడి, మార్కెటింగ్ గురించి వివరించారు. అనంతరం గ్రామం చిత్రపటాన్నివేసి యువశాస్త్రవేత్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే విభాగాధిపతి డాక్టర్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రవికుమార్, డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఐసీఏఆర్ ప్రతినిధులు డాక్టర్ దామోదర్‌రెడ్డి, డాక్టర్ వెంకట్‌కుమార్, డాక్టర్ వెంకటేశన్, రైతులు పాల్గొన్నారు.