
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
యువకుడు ...
పటాన్‌చెరుటౌన్: యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు సాయంత్రం తన అన్న విట్టల్ వాట్సాప్‌కు ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నానని మెసేజ్ పెట్టాడు‘. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తమ్ముడి అదృశ్యంపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ...
నర్సాపూర్ రూరల్: గిరిజన మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని తుజల్‌పూర్ పంచాయతీ పరిధిలోని అర్జున్ తండాలో జరిగింది. ఎస్సై జగన్నాథం కథనం ప్రకారం.. తండాకు చెందిన కొర్ర పవన్ భార్య మౌనిక (20). గురువారం మధ్యాహ్నం బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకడంతో పాటు బంధువులు, తెలిసిన వారిని ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాలుడు ...
తూప్రాన్: మతి స్థిమితం సరిగాలేని బాలుడు అదృశ్యం అయ్యాడు. ఈ ఘటన ఘనపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన మనోజ్‌ప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా ఘనపూర్ సమీపంలోని ఓ సీడ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇతని పెద్ద కుమారుడు సందీప్‌కుమార్(16)కు చిన్నప్పటి నుంచి మతి స్థితిమితం సరిగా లేదు. హైదరాబాద్‌లో వైద్యం చేయించేందుకు బిహార్ నుంచి ఇటీవల తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8న సందీప్‌కుమార్ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం

వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం