
ప్రభుత్వాస్పత్రిలో అరుదైన ఆపరేషన్
మహిళ కడుపులోంచి 3.2 కిలోల గడ్డ తొలగింపు
దుబ్బాక: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా.. మండలంలోని హబ్షీపూర్ గ్రామానికి చెందిన శోభ(43) కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి రాగా వైద్యులు ఆమెకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి కడపులో పెద్ద గడ్డ ఉందని నిర్ధారించారు. శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి శోభ కడపులోంచి 3.2 కిలోల పెద్ద పైబ్రాయిడ్ గడ్డను తొలగించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని బాధిత కుటుంబీకులు అభినందించారు.