
భూములు గుర్తించి ఫెన్సింగ్ వేయాలి
ఝరాసంగం(జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతున్న నిమ్జ్ పరిసరాల్లో స్మార్ట్ సిటీఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. టీజీఐఐసీ ఎండీ శశాంక్, కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారులో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ..స్థానిక అధికారులు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కోసం అవసరమయ్యే భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. త్వరలో అభివృద్ధి పనులకు టెండర్ వేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. సుమారు 3,200 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,300 కోట్లతో పనులు చేపట్టనున్నారు. అనంతరం నిమ్జ్ ప్రాంతాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్మార్ట్ సిటీ భూముల పరిశీలనలో
టీజీఐఐసీ ఎండీ