
దాతృత్వాన్ని చాటుకున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటి చూపు కోల్పోయి అంధుడిగా మారిన సంపూరన్ నాయక్ అనే విద్యార్థికి కంటి చికిత్స కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం రూ.పది లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కందిలో స్థిరపడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిసాన్‌పవార్, శాంతాబాయిల కుమారుడు సంపూరన్ నాయక్‌కు ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడటంతో కోమాలోకి వెళ్లిపోయాడు.
తిరిగి కోలుకున్నప్పటికీ.. కంటి చూపు పోయింది. నాయక్ కోసం ఇప్పటికే రూ.ఐదు లక్షల వరకు ఆ పేద కుటుంబం ఖర్చు చేసింది. చూపు రావాలంటే రెండు ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ. పది లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అంత మొత్తాన్ని వెచ్చించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం జగ్గారెడ్డిని ఆశ్రయించగా వెంటనే రూ.పది లక్షల నగదును అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.