
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరికి రిమాండ్
పటాన్‌చెరు టౌన్: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. క్రైమ్ సీఐ రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధికి చెందిన రంగారావు గత నెల 26న మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలో ఉన్న బంగారు చైన్ అపహరించారు. దీంతో బాధితుడు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఇస్నాపూర్ చౌరస్తాలో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన మొయినా బాద్ అజిత్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అబ్బాస్, మాదాపూర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ షాన్వాస్ అదుపులోకి తీసుకొని విచారించారు. ఇస్నాపూర్‌లో చైన్ స్నాచింగ్ తామే చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే వీరిపై పలు పోలీస్‌స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారి నుంచి 1.3 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, బైకు, ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసి వారిని రిమాండ్‌కి తరలించారు.