
లోక్‌అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లావ్యాప్తంగా 19,858పెండింగ్‌లో కేసులు జిల్లా వ్యాప్తంగా 12 బెంచీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న న్యాయవాదులు, పోలీసులు
సంగారెడ్డి టౌన్ : జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘రాజీయే రాజమార్గం’అనే నినాదంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు లోక్‌అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తున్నాయి. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జీలు సూచిస్తున్నారు.
పెండింగ్ కేసులు ఎక్కువగానే...
జిల్లా వ్యాప్తంగా 19,858కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లోక్ అదాలత్‌లో విద్యుత్, టెలిఫోన్ రికవరీ, సివిల్, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాణాలు, మోటార్ వెహికల్ కేసులు, బ్యాంకుల రికవరీ కేసులు వస్తాయి.
జిల్లా వ్యాప్తంగా 12 బెంచీలు
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా 12బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. సంగారెడ్డిలో ఏడు, జహీరాబాద్‌లో మూడు, నారాయణఖేడ్, జోగిపేటలో ఒక్కొక్కటి చొప్పున బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.