
షాబుద్దీన్ దర్గాకు చాదర్ సమర్పణ
జహీరాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు హజ్రత్ షేక్ షాబుద్దీన్ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. మంగళవారం రాత్రి హరీశ్‌రావు మండలంలోని శేఖాపూర్‌లో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలపై చాదర్ పెట్టుకుని దర్గాకు సమర్పించారు. అనంతరం దర్గాను దర్శించారు. ఖవ్వాలీ కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, బీఆర్‌ఎస్ నాయకులు ఖిజర్ యాఫై, తట్టు నారాయణ, సంజీవరెడ్డి, వెంకటేశం, మొహియొద్దీన్, యాకూబ్, నామ రవికిరణ్, విజేందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, ఉర్సు కమిటీ సభ్యులు కిజర్, చస్మొద్దీన్ పాల్గొన్నారు.
హామీలు వెంటనే
అమలు చేయాలి
ములుగు(గజ్వేల్): వికలాంగులు, చేయూత పింఛన్‌దారులకు ఎన్నికలకు ముందూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగె మహేశ్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. హామీల అమలు విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 15న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
వాహనం ఢీకొని
యువతి మృతి
పటాన్‌చెరు టౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువతి మృతిచెందిన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. బొల్లారం వైపు నుంచి ముత్తంగి రింగ్ రోడ్డు ఎగ్జిట్ సమీపంలో గుర్తుతెలియని యువతి (25)ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి సంబంధించిన బంధువులు ఉంటే పటాన్‌చెరు పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.