
సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ
విద్యార్థులకు
సర్టిఫికెట్లు అందజేత
వర్గల్(గజ్వేల్): స్థానిక పూలే గురుకుల బాలికల డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ సాధనకు ఉపయుక్తంగా నిలిచే అంశాలపై నంది ఫౌండేషన్ నిర్వహించిన వారం రోజుల శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. శిబిరంలో 100 మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఫేసింగ్ మెలకువలు, రెస్యూమే ప్రిపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు ఎలా సాధించాలో ట్రైనర్లు వోమిజి, శ్యామ్ వివిధ యాక్టివిటీల ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఉపయోగపడే మాన్యువల్ పుస్తకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాధ పాల్గొన్నారు.