
తుది జాబితా ప్రకటించిన అధికారులు
పోలింగ్ స్టేషన్లు 1,458
సంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రాదేశిక పరిషత్ ఎన్నికలకు 7,44,157 మంది ఓటర్లు ఉండగా 1,458 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. త్వరలో నిర్వహించే పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బుధవారం తుది ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్లు జాబితాను విడుదల చేశారు. 635 ప్రాంతాలలో 1458 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు.
జిల్లా వ్యాప్తంగా 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 261 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. కొత్తగా మండలాల ఏర్పాటుతో పాటు పాత మండలాలు మున్సిపాలిటీలుగా మారటంతో పరిషత్ స్థానాల సంఖ్య తగ్గింది. 2019 సంవత్సరంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలలో 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 295 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. గతంలో కంటే ప్రస్తుతం స్థానాల సంఖ్య తగ్గింది.