
ఉత్తమ ప్రతిభ కనబరచాలి
న్యూస్‌రీల్
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది, అధికారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొ న్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో ఎస్పీ మాట్లాడుతూ..వర్టికల్ నియమాలను పాటి స్తూ విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పొందుపరచాలని చెప్పారు. వర్టికల్ విభాగంలో ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందిస్తామని వెల్లడించారు.
ఇన్‌చార్జి ఆర్డీఓగా
పాండు బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి : సంగారెడ్డి ఇన్చార్జి ఆర్డీఓగా ఆర్.పాండు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జోగిపేట ఆందోల్ డివిజన్ ఆర్డీవోగా పనిచేస్తున్న ఆయనకు సంగారెడ్డి ఇన్‌చార్జిగా కలెక్టర్ ప్రావీణ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఇక్కడ ఆర్డీవోగా ఉండి పని చేసిన రవీందర్‌రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న పాండును రెవెన్యూ డివిజన్ శాఖ సిబ్బంది ఆయనకు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. కార్యాలయ ఏవో తన్‌మొళి, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం నాయక్, సిబ్బంది తదితరులున్నారు.

ఉత్తమ ప్రతిభ కనబరచాలి