
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వెల్దుర్తి(తూప్రాన్) : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అందుగులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఫాం సత్యనారాయణ(40), సునీతలు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. సత్యనారాయణ వ్యవసాయంతో పాటు తాపీమేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆయన మూడు రోజుల క్రితం పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు.