
రెడ్‌కో చైర్మన్‌ను కలిసిన రమేశ్ చౌహాన్
నారాయణఖేడ్: తెలంగాణ రెడ్కో నూతన ఛైర్మన్‌గా నియమితులైన డా.శరత్ నాయక్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రమేశ్ చౌహాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనవెంట సంఘం నాయకులు చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.
వెనుకబడిన విద్యార్థులపై
దృష్టి పెట్టాలి: డీఈఓ
పటాన్‌చెరు టౌన్: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అమీన్‌పూర్ ము న్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, గండిగూడ ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన తీరును తరగతి గదిలోకి వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ పరితోశ్
సంగారెడ్డి జోన్: ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండి రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కక్షిదారులకు ఈ లోక్‌అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. వీలైనన్ని ఎక్కువ కేసులు లోక్‌అదాలత్‌లో రాజీ పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎస్‌జీఎఫ్ క్రీడల్లో అల్గోల్
గురుకుల విద్యార్థులు
జహీరాబాద్ టౌన్: 69వ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) క్రీడల్లో అల్గోల్ మైనార్టీ గురుకుల విద్యార్థులు సత్తాచాటి ప్రతిభ కనబరిచారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండర్ –14, అండర్–17 విభాగాల్లో పోటీలు నిర్వహించగా మూడు విభాగాల్లోనూ అల్గోల్ విద్యార్థులు మొదటి బహుమతి సాధించారని ప్రిన్సిపాల్ జె.రాములు తెలిపారు. గురుకులం నుంచి 26 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఖలీల్, పీఈటీ అనిల్‌కుమార్, పీడీ.ప్రశాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘స్థానికం’లో యువతకు ప్రాధాన్యం: నరేశ్‌గౌడ్
జహీరాబాద్: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ...గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో 20% కోట యువతకు కేటాయించాలన్నారు. అన్ని ఎన్నికల్లో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ నియోజకవర్గం అధ్యక్షుడు నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు నరేశ్ యాదవ్, వసీం, ప్రధాన కార్యదర్శులు అక్బర్, శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రెడ్‌కో చైర్మన్‌ను కలిసిన రమేశ్ చౌహాన్

రెడ్‌కో చైర్మన్‌ను కలిసిన రమేశ్ చౌహాన్