
కాళోజీ ఆలోచనలు యువతకు ఆదర్శం
సంగారెడ్డి జోన్: తెలంగాణ ప్రజా కవి కాళోజి నారాయణరావు ఆలోచనలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని డీఆర్‌ఓ పద్మజారాణి పేర్కొన్నారు. మంగళవారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కాళోజీ చిత్రపటానికి ఏఆర్ డీఎస్పీ నరేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.

కాళోజీ ఆలోచనలు యువతకు ఆదర్శం