
భూములు బలవంతంగా తీసుకోవద్దు
జహీరాబాద్ టౌన్: నిమ్జ్ ప్రాజెక్టు కోసం రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని శ్రామీక్ భవనంలో సోమవారం నిమ్జ్ భూబాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రూ.కోటి వరకు ధర పలికే భూములను ప్రభుత్వం ఎకరాకు రూ.15 లక్షలే చెల్లిస్తుందన్నారు. నిమ్జ్ కోసం ఇప్పటికే వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ వేసిందని, బలవంతపు భూసేకరణకు నిరసనగా ఈ నెల 12న భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకలు ఎస్.కుమార్, బి.నర్సింలు, తుల్జరాం, సంగన్న రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా అధ్యక్షుడు రాంచందర్