
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుతెచ్చిన కాళోజీ
మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు
మెదక్ మున్సిపాలిటీ/మెదక్ కలెక్టరేట్: తన కవిత్వంతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కాళోజీ రచనలు సామాజిక చైతన్యాన్ని పెంపొందిచేలా ఉంటాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో డీఆర్‌ఓ భుజంగరావు పాల్గొని కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
13న జాతీయ లోక్ అదాలత్
ఈనెల 13న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దన్నారు.