
రైతుల ఇబ్బందులు తొలగించాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: రైతులకు యూరియా అందించి వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదిక వద్దకు వెళ్లిన సునీతారెడ్డికి రైతులు తమ ఇబ్బందులను వివరించారు. నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా ఒక్క బస్తా యూరియా దొరకలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. యూరియా దొరకనందున పంటలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నారని, మాజీ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా రాష్ట్రానికి యూరియా తీసుకురాగలిగారని, రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడలేదని ఆమె చెప్పారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి యూరియా తేవడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు యూరియా కోసం ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్‌తోపాటు వ్యవసాయాధికారులతో మాట్లాడి నర్సాపూర్‌కు అవసరం మేరకు యూరియా సరఫరా చేయాలని కోరారు. రైతులకు ప్రాధాన్యత పద్ధతిలో యూరియా అందజేయాలని మండల వ్యవసాయాధికారి దీపికకు సునీతారెడ్డి సూచించారు. ఆమె వెంట పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.