
సమాజ మార్గదర్శకులు గురువులే
డీఈఓ రాధాకిషన్
పాపన్నపేట(మెదక్): ఉపాధ్యాయులు నవ సమాజ మార్గదర్శకులని జిల్లా విద్యాశాఖ అఽధికారి రాధాకిషన్ పేర్కొన్నారు. పాపన్నపేటలో మంగళవారం జరిగిన మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదర్శవంతమైన సమాజాన్ని తయారు చేసే శక్తి ఉపాధ్యాయునికే ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, క్రీడాకారులు, సైంటిస్టులుగా దేశానికి సేవలందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పాపన్నపేట మండల స్థాయిలో విశిష్ట సేవలు అందించిన 28 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించారు. వీరితోపాటు మండలం నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికై న సాయిసిరికి, జిల్లా స్థాయికి ఎంపికై న సాయిలు, చంద్రశేఖర్, మల్లేశం, దుర్గా ప్రసాద్‌లకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, డీఎస్‌ఓ రాజిరెడ్డి, హెచ్‌ఎంలు మహేశ్వర్, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.