
ప్రభుత్వ విద్యకు తొలి ప్రాధాన్యం
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
● మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి
● జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
పటాన్‌చెరు: ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేయడమే తొలి ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్లే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొ న్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో కలసి మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారన్నారు. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మత్తుపదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరా రు. అంతకుముందు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.