
బాలికల హక్కులపై అవగాహన
వట్‌పల్లి(అందోల్): కిశోర వయస్సు బాలికలు తమ హక్కులు, చట్టాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త జి.పల్లవి స్పష్టం చేశారు. మండల పరిధిలోని పోతులబోగుడా మోడల్ పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే అత్యవసర సమయాల్లో 1098 బాలల, 181 మహిళా హెల్ప్‌లైన్‌లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంఈఓ ఎన్.రంజిత్ కుమార్ మాట్లాడుతూ..యువతులు ఉన్నత విద్యనభ్యసించడం ద్వారా ఉద్యోగం సాధించి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు.
జిల్లా మహిళా సాధికారత
కేంద్రం సమన్వయకర్త జి.పల్లవి