
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ మండలం బండ్రాన్‌పల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గానికి మొదటివిడతగా 3,500 ఇళ్లు మంజూరుకాగా వాటి నిర్మాణం పూర్తయిన వెంటనే అదనంగా మరో 1,000 ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక, పేదలకు మహిళాసంఘాల ద్వారా రూ.లక్ష చొప్పున రుణం, దశలనుబట్టి విడతలవారీగా బిల్లులను అందజేయడం జరుగుతుందన్నారు. ఇళ్లు మంజూరయిన వారు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తిచేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట గృహనిర్మాణ శాఖ ఏఈ వంశీ, మాజీ ఎంపీటీసీ మాణిక్యం, నాయకులు పండరీరెడ్డి, సంగయ్య, సర్దార్‌నాయక్ ఉన్నారు.