ట్యాబ్‌ ఒక ఉపాధ్యాయుడితో సమానం | - | Sakshi
Sakshi News home page

ట్యాబ్‌ ఒక ఉపాధ్యాయుడితో సమానం

Sep 9 2025 12:54 PM | Updated on Sep 9 2025 12:54 PM

ట్యాబ్‌ ఒక ఉపాధ్యాయుడితో సమానం

ట్యాబ్‌ ఒక ఉపాధ్యాయుడితో సమానం

● ఎంపికై న 60 ప్రభుత్వ పాఠశాలలకు ● 3 ట్యాబ్‌లు : డీఈఓ

● ఎంపికై న 60 ప్రభుత్వ పాఠశాలలకు ● 3 ట్యాబ్‌లు : డీఈఓ

మెదక్‌ కలెక్టరేట్‌: ఒక ట్యాబ్‌ ఒక ఉపాధ్యాయుడితో సమానమని, ఈ లర్నింగ్‌ ప్రోగ్రాంలో ఈ ట్యాబ్‌లు ఎంతగానో ఉపయోగ పడుతాయని డీఈఓ రాధాకిషన్‌ తెలిపారు. సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌లో మేఘశాల అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లాలోని 60 పాఠశాలలకు 180 ట్యాబ్‌లను డీఈఓ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ఈ లర్నింగ్‌ అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ కృషి చేయడం అభినందనీయమన్నారు. తక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో ఈ ట్యాబ్‌ల ద్వారా బోధన ఎంతో సులభంగా ఉంటుందని, అలాంటి పాఠశాలలను ఎంపిక చేసి నట్లు తెలిపారు. అనంతరం మేఘశాల సంస్థ ప్రతినిధులు ప్రశాంత్‌రెడ్డి, జయలక్ష్మి మాట్లాడుతూ... ఈ ఏడాది మెదక్‌ (60), సిద్దిపేట(45), యాదాద్రి భువనగిరి (45)ల చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు 3 ట్యాబ్‌లను అందజేసినట్లు చెప్పారు. వీటికి ఎలాంటి ఇంటర్నెట్‌ అవసరం ఉండదని, ఆఫ్‌లైన్‌లోనే విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చునని తెలిపారు. ’ఒక్కో పాఠశాలలో 6,7,8 తరగతులకు గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్ట్‌లు నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ మానిటరింగ్‌ అధికారి సుదర్శన్‌మూర్తి, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, మెదక్‌ ఎంఈఓతోపాటు మేఘశాల ప్రతినిధులు సత్యప్రియ జిల్లాలో ఎంపికై న 60 పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement