
మొట్ట మొదటి నియోజకవర్గం
1982లో రాజగోపాల్‌పేట నియోజకవర్గంగా ఏర్పాటైంది. కాంగ్రెస్ అభ్యర్థి కేవి నారాయణరెడ్డి గెలుపొంది మొట్టమొదటి ఎమ్మెల్యేగా శాసనభలో అడుగుపెట్టాడు. 1985లో ప్రభుత్వం మండల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో జనాభా ప్రాతిపాదికన సిద్దిపేట నియోజకవర్గం ఏర్పాటైంది. రాజగోపాల్‌పేట నంగునూరు మండల పరిధిలోకి రావడంతో సాధారణ గ్రామ పంచాయతీగా మారింది.
కూలుతున్న
బురుజు
రాతి కట్టడం
క్రీ.శ.1309 వరకు కాకతీయుల పాలనలో దేశ్‌ముఖ్‌లు ఇక్కడ గుళ్లు, గోపురాలు, కోటలు కట్టించి రాజగోపాలపురంగా నామకరణం చేశారు. ఎత్తైన కోట, రాజు, రాణి గృహాలు, పరిచారికలకు గదులు, తాగునీటి కోసం చేదబావి, రాతి బురుజును నిర్మించి సమీపంలోనే పెద్ద చెరువును తవ్వించారు. ఈ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సిద్దిపేట, చేర్యాల, బెజ్జంకి, నంగునూరు, హుస్నాబాద్ మండలాల్లోని 70 గ్రామాల్లో కోటలు కట్టించి పరిపాలన సాగించారు. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు రాజు గది నుంచి ముండ్రాయిలోని లక్ష్మినర్సింహ స్వామి గుట్ట వరకు సొరంగ మార్గం తవ్వించారని గ్రామస్తులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలంగా సామంత రాజులుగా ఉన్న దేశ్‌ముఖ్‌లు కాకతీయులకు కప్పం కడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని తెలుస్తోంది.