
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
● తండ్రి అక్కడికక్కడే మృతి
● కుమారుడికి తీవ్ర గాయాలు
వట్‌పల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ఒకరు మృతి చెందగా, మరొకరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం అందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద 161 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. జోగిపేట ఎస్‌ఐ పాండు వివరాల ప్రకారం... పుల్కల్ మండలం సింగూరు గ్రామానికి చెందిన కుమ్మరి బాబు, అతని తండ్రి నర్సింలు(60)తో కలిసి ద్విచక్ర వాహనంపై అల్మాయిపేటకు వెళుతుండగా సంగుపేట గ్రామ శివారులోకి రాగానే వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తండ్రి నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడికి ఎడమ చేయి విరిగింది.
అప్పుల బాధతో
ఆటో డ్రైవర్ ఆత్మహత్య
హుస్నాబాద్‌రూరల్: ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మారెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని పోతారం(ఎస్)కు చెందిన నమిలికొండ సురేశ్(28) ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కల్పించడంతో ఆటోలకు కిరాయిలు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కుటుంబ పోషణ, ఆరోగ్య సమస్యల కోసం రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. ఆటో కిరాయిలు రాక అప్పులు తీర్చే మార్గం కనిపించపోవడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు