
కమ్యూనిస్టులతోనే వెట్టి చాకిరి విముక్తి
సిద్దిపేటఅర్బన్: దొరలు, భూస్వాములు, నైజాంల వెట్టి చాకిరీ నుంచి తెలంగాణను విముక్తి చేసింది కమ్యూనిస్టులేనని, దున్నే వాడికి భూమిని పంచింది ఎర్ర జెండా నేతలేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ పేర్కొన్నారు. సీపీఎం పార్టీ సిద్దిపేట ప్రాంత రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ విశిష్టత–నిర్మాణం అనే అంశంపై రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ బోధించారు. భూ స్వాములు, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా నైజాం ప్రభువును గద్దె దించడానికి గ్రామ గ్రామాన ఎర్రజెండా చేత పట్టి నీ బాంచన్ దొర అన్న వారి చేత బందూక్ పట్టించి పోరాటాలకు సిద్ధం చేసింది ఎర్ర జెండా మాత్రమేనన్నారు. కార్యక్రమంలో రవికుమార్, గోపాలస్వామి, శశిధర్, బాలనర్సయ్య, శిరీషా, శ్రీనివాస్, ప్రశాంత్, కనకయ్య, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్