
రైతులకు శాపం
ఇష్టారాజ్యంగా నిమ్జ్ రహదారి నిర్మాణం
ప్రణాళిక లోపం..
నిమ్జ్ రహదారి నిర్మాణం ప్రణాళికాబద్ధంగా చేపట్టకపోవడం శాపంగా మారింది. కొత్త రోడ్డు నిర్మాణంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రహదారి నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసినప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనంతో నిధులు వృథా అవుతున్నాయి. నాణ్యత సైతం పాటించలేదని పలువురు విమర్శిస్తున్నారు.
– సంగారెడ్డి జోన్
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల పరిధిలో సుమారు 13 వేల ఎకరాల విస్తీర్ణంలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదకమండలి (నిమ్జ్) ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే సుమారు 7,000 ఎకరాల వరకు భూసేకరణ పూర్తి అయింది. ప్రాజెక్టు కోసం మౌలిక వసతుల్లో భాగంగా జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ వరకు 100 అడుగుల వెడల్పుతో సుమారు 9.3 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.100 కోట్లు వెచ్చి ంచారు. కాని అధికారులు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాదకరంగా మలుపులు
రహదారిపై పలుచోట్ల ఉన్న మలుపులు ప్రమాదకరంగా మారాయి. హెగ్గెల్లి వద్ద జాతీయ రహదారిని నిమ్జ్ రహదారికి అనుసంధానం చేశారు. పరిశ్రమలకు భారీ వాహనాలతో పాటు కంటైనర్ల రాకపోకలకు ఇబ్బందులు తప్పేలా లేవు. కృష్ణాపూర్ శివారులోని మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉంది. దగ్గరకు వచ్చేంత వరకు రోడ్డు కనిపించటం లేదు. యూటర్న్ సైతం చిన్నగా ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన రహదారిపై ఇలాంటి మలుపులు ఏంటని పలువులు ప్రశ్నిస్తున్నారు. అలాగే రహదారి నిర్మాణం కోసం బర్దిపూర్, మాచ్నూర్, కృష్ణాపూర్, బిడేకన్నె, హుగ్గెల్లి శివారులోని పంట పొలాలను సేకరించారు. కృష్ణాపూర్ శివారులో రెవెన్యూ అధికారి బంధువుకు సంబంధించిన భూమి ఉండటంతో పక్క నుంచి భూ సేకరణ చేసి రహదారి నిర్మించడంతోనే మలుపు ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. కల్వర్టులు సైతం చిన్నగా నిర్మించడంతో పాటు రహదారి నిర్మాణంలో సైతం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చిన్నగా నిర్మించిన కల్వర్టులు
చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
భూసేకరణపై అనుమానాలు!
తీవ్రంగా నష్టపోతున్నాం
వాగులపై కల్వర్టులు చిన్న గా ఉన్నాయి. నాకున్న 4 ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నా. అలాగే 7 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తితో పాటు సోయా తదితర పంటలు సాగు చేస్తున్నా. వర్షాలు కురిసిన సమయంలో వరద నీటితో పొలాలు నిండిపోయి నష్టపోతున్నాం. – పాండు, రైతు, కృష్ణాపూర్

రైతులకు శాపం

రైతులకు శాపం