
న్యూస్‌రీల్
ఝరాసంగం(జహీరాబాద్): సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని మూసివేశారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలతో పాటు దర్శన సౌకర్యం కల్పించారు. అనంతరం ఆలయం మూసివేశారు. సోమ వారం ఉదయం సంప్రోక్షణ చేసి ప్రాతఃకాల పూజల అనంతరం దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ శివరుద్రప్ప తెలిపారు.
పాపన్నపేట(మెదక్): చంద్రగ్రహణం పురస్కరించుకొని ఆదివారం ఏడుపాయల దుర్గాభవాని మాత దర్శనం నిలిపివేశారు. ఆలయం ఎదుట నుంచి మంజీరా నీరు ప్రవహిస్తుండటంతో గత 25 రోజులుగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం ఉండటంతో మధ్యాహ్నం నుంచి దర్శనం, పూజలు నిలిపివేశారు. తిరిగి సోమవారం ఉదయం శుద్ధి అనంతరం దర్శనం ప్రారంభిస్తామని అర్చకులు తెలిపారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు కలుషితమైన నీరు సరఫరా అవుతోంది. ఇప్పటికే జ్వరాలతో సతమతం అవుతున్నామని, ఈ తరుణంలో రంగు మారిన నీటిని ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని 39 గ్రామాలతో పాటు తండాలు, ఝరాసంగం మండలంలోని సుమారు 36 గ్రామాలతో పాటు పలు తండాలకు తాగు నీరు అందించేందుకు రాఘవాపూర్ సమీపంలో మంజీరా వద్ద ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసిన నీరు రోజూ ఆయా గ్రామాలకు సరఫరా అవుతోంది. అయితే ఇటీవల భారీ వర్షాలకు మంజీరాకి పెద్ద ఎత్తున కొత్త నీరు వచ్చి చేరింది. ఆ నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా గ్రామాలకు సరఫరా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మిషన్ భగీరథ అధికారులను సంప్రదించగా, నీటిని ట్రయల్ చేయ డం వల్ల రంగు మారిన నీరు వచ్చి ఉండవచ్చని, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మెదక్ కలెక్టరేట్: కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సోమవారం మెదక్ డిగ్రీ కళాశాలలో రాష్ట్రస్థాయి కార్యశా లను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ వామనమూర్తి సమన్వయకర్తగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సృజనాత్మక రచనలు, పాట, కవితా రచన మొదలైన అంశాలలో విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థులందరూ తప్పకుండా సదస్సుకు హాజరుకావాలని సూచించారు.
నాచగిరి ఆలయ
ద్వారబంధనం
వర్గల్(గజ్వేల్): సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నాచగిరి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం యథావిధిగా పూజాకార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులకు దర్శనం ఉంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి విజయ రామారావు తెలిపారు.

న్యూస్‌రీల్

న్యూస్‌రీల్

న్యూస్‌రీల్