
ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
మాజీ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్‌రూరల్: తెలంగాణ ఉద్యమంలో ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, మద్యం మహమ్మారి, రైతు ఆత్మహత్యలపై పోరాటాలు అభినందనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. ఆదివారం గజ్వేల్ ప్రెస్‌క్లబ్ రజతోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు గ్రామీణ ప్రాంత విలేకరులకు బస్‌పాసులు అందించామన్నారు. రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ఈహెచ్‌ఎస్ ఏర్పాటుకు అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామన్నారు. వారంలోగా సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, బేవరేజస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌అలీ, జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్, లోక్‌సత్తా తెలుగు ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
మల్లన్న ఆలయం మూసివేత
కొమురవెల్లి(సిద్దిపేట): సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆలయ అధికారులు, అర్చకులు మూసివేశారు. ఈసందర్భంగా ఈఓ టంకసాల వెంకటేశ్ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం సంప్రోక్షణ శుద్ధి, ప్రాతఃకాల పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పి స్తామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులు, అర్చకులకు సహకరించాలని కోరారు.

ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం