
విలువలతో కూడిన విద్యనందించాలి
జహీరాబాద్: విద్యార్థులను సమాజ, దేశ ప్రయోజకులుగా తీర్చిదిద్దినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్, కవి కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడం ద్వారానే దేశం ప్రగతి పథంలో ముందడుగు వేస్తుందన్నారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి ఉత్తమ పౌరులను అందించగలిగేది ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో ఏటా ఉపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం కొనసాగించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మాణయ్య, ట్రస్మా నాయకులు రాఘవేందర్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సాయితేజ, ప్రభాకర్‌రెడ్డి, ఏసురత్నం, సునీల్, స్వరాజ్, శేఖర్, జహంగీర్, వెంకట్‌రాంరెడ్డి, ముజాహిద్ పాల్గొన్నారు.