పారిశుద్ధ్యం లోపించొద్దు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం లోపించొద్దు

Sep 7 2025 8:39 AM | Updated on Sep 7 2025 8:39 AM

పారిశ

పారిశుద్ధ్యం లోపించొద్దు

కంది(సంగారెడ్డి): గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని డీపీఓ సాయిబాబా సూచించారు. శనివారం మండల పరిధిలోని చిమ్మాపూర్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. మురికి కాల్వలు, గుంతల్లో నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. తడి,పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు పంచాయతీ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునీతతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాస్థాయిలోనూ రాణించాలి

క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయులు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): ఇటీవల హద్నూర్‌లో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌జీ క్రీడా పోటీల్లో రాణించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా ప్రతిభ చూపాలని జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయులు ఆకాంక్షించా రు. న్యాల్‌కల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ విభాగంలో ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే. కాగా, క్రీడాకారులను శనివారం ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్‌ తదితరులు అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సచ్చిదానందరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ మల్లేశ్వరీ, ఉపాధ్యాయులు మొగులయ్య, పీడీ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

సాకి చెరువును సందర్శించిన అదనపు కలెక్టర్‌

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని సాకి చెరువును శనివారం రాత్రి అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి.. నిమజ్జనానికి వస్తున్న విగ్రహాలపై ఆరా తీశారు.

జీపీల్లో ఓటరు జాబితా

ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి

జహీరాబాద్‌ టౌన్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఓటర్ల జాబితాను శనివారం అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్‌, పోలింగ్‌స్టేషన్‌ జాబితాను పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించామన్నారు. జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 8 తేదీలోపు పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. అభ్యంతరాలను పరిష్కరించి 10న తుది జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.

పారిశుద్ధ్యం లోపించొద్దు  
1
1/2

పారిశుద్ధ్యం లోపించొద్దు

పారిశుద్ధ్యం లోపించొద్దు  
2
2/2

పారిశుద్ధ్యం లోపించొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement