
అభివృద్ధి పనులు వేగవంతం
● విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం ● అభివృద్ధి పనులపై సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్య, వైద్య సంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పనే ప్రభుత్వం అధికప్రాధాన్యమిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలోని కేజీబీవీ మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై శనివారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో ఉన్న కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో బెడ్స్, కిచెన్ సామగ్రి, టేబుల్స్, ప్లేట్స్, పుస్తకాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు, స్పోర్ట్స్ కిట్స్ వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో కావాల్సిన వసతులపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆయా పరిశ్రమలు చేపట్టిన అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జానాయక్, సీపీఓ బాలశౌరి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, టీఎస్‌ఈడబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.