డీడీఎస్‌–కేవీకేకు 4 అవార్డులు | - | Sakshi
Sakshi News home page

డీడీఎస్‌–కేవీకేకు 4 అవార్డులు

Sep 6 2025 9:09 AM | Updated on Sep 6 2025 9:09 AM

డీడీఎ

డీడీఎస్‌–కేవీకేకు 4 అవార్డులు

● కంగ్టి మండలం నాగూర్‌(కె) గ్రామంలో డీడీఎస్‌–కేవీకే శాస్త్రవేత్తల పరిచయం ద్వారా రైతులు అధిక సాంద్రత (హెచ్‌డీపీఎస్‌) పద్ధతిలో పత్తి పంటను సాగు చేశారు. దీంతో 23 శాతం దిగుబడుల పెరుగుదలతో పాటు నికర ఆదాయం పెంచుకోగలిగారు. ● తీగ చిక్కుడులో అధిక దిగుబడి జాతి అయిన ఆర్కఅమోఘ్‌ రకం సాగు చేసిన జహీరాబాద్‌కు చెందిన రైతు ప్రతాప్‌రెడ్డి హెక్టారుకు 30 శాతం దిగుబడిని పెంచుకున్నాడు. –అడవి పందుల నియంత్రణకు జహీరాబాద్‌ మండలం లచ్చునాయక్‌ తండాకు చెందిన రైతు రామ్‌ చౌహాన్‌ జొన్న పంటలో బయో అకౌస్టిక్స్‌ పరికరాలను శాస్త్రవేత్తలు అమర్చారు. దీంతో అడవి పందుల వల్ల కలిగే నష్టాన్ని విజయవంతంగా తగ్గించారు. ● ఎస్సీ సబ్‌ప్లాన్‌ పఽథకంలో భాగంగా ఝరాసంగం మండలం పొట్‌పల్లికి చెందిన దళిత మహిళా రైతు పూలమ్మకు డీడీఎస్‌–కేవీకే శాస్త్రవేత్తలు పెరటి కోళ్లను అందజేశారు. 90 రోజుల పెంపకంలో సుమారు రూ.6వేల ఆదాయం సమకూరడమే కాకుండా గుడ్ల ద్వారా పోషకాహారాన్ని కూడా పొందారు. ఈ విజయాలతో జహీరాబాద్‌లోని డీడీఎస్‌–కృషి విజ్ఞాన కేంద్రం జాతీయ వేదికపై మరో మారు తన ప్రతిభను చాటుకుంది.

● అటారీ జోన్‌–10 వార్షిక వర్క్‌షాప్‌లో ఎంపిక ● అవార్డు అందుకున్న శాస్త్రవేత్త వరప్రసాద్‌

మెరుగైన ఐఐటీహెచ్‌

ర్యాంకింగ్‌

ఇంజనీరింగ్‌లో 7వ స్థానం

తొలితరం ఐఐటీలను దాటి..

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌)లో హైదరాబాద్‌ ఐఐటీ మెరుగైన ర్యాంకింగ్‌ను సాధించింది. మొట్ట మొదటిసారి తొలితరం ఐఐటీలను దాటివేసింది. ఇంజనీరింగ్‌ విభాగంలో గతేడాది (2024లో) దేశంలోనే 8వ ర్యాంకు ఉండగా, ఈసారి 7వ స్థానానికి చేరింది. నూతన ఆవిష్కరణలో 6వ ర్యాంకు సాధించింది. పరిశోధనల్లో 15వ ర్యాంకు, ఓవరాల్‌ ర్యాంకింగ్‌లో 12వ ర్యాంకు వచ్చింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ బీ.ఎస్‌.మూర్తి మాట్లాడుతూ..ఆత్మనిర్భర్‌భారత్‌, డిజిటల్‌ ఇండియా, వికసిత భారత్‌–2047 వంటి జాతీయ మిషన్‌లలో లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పాటునందించేందుకు సంస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. సెమీ కండక్టర్లు, సస్టైనబుల్‌ ఎనర్జీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళతామన్నారు.

విజయగాథలు

అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు

జహీరాబాద్‌: తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో అటారి జోన్‌–10 పరిధిలోని 72 కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక జోనల్‌ వర్క్‌షాప్‌లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డీడీఎస్‌–కేవీకేకు నాలుగు అవార్డులు లభించాయి. నాలుగు విభాగాల్లో లభించిన అవార్డులను డీడీఎస్‌–కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త సి.వరప్రసాద్‌ వెల్లూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను అందుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు వెల్లూర్‌లో కేవీకేల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు, చిక్కుడులో అధిక దిగుబడి సాధించడం, అడవి పందుల నివారణకు పరికరం అమర్చడం, పెరటి కోళ్లపెంపకంలో సాధించిన విజయాలకు గాను అవార్డులు దక్కాయి. మట్టి ఆరోగ్య కార్డులు, మట్టి శాస్త్రంపై ఆధారపడి సమగ్ర పోషక పదార్థాల నిర్వహణను ప్రోత్సహించడంలో విశిష్ట ప్రతిభ కనబర్చినందుకు గాను ప్రత్యేక అభినందన పత్రాన్ని డీడీఎస్‌–కేవీకే అందుకుంది. ఉత్తమ విజయ గాథల విభాగం, ఉత్తమ బాక్స్‌ ఐటెమ్స్‌ కంటెంట్‌ విభాగంలలో రెండో స్థానం దక్కించుకుంది. అత్యధిక భూమి ఆరోగ్య కార్డులు జారీ చేసిన విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. 2024 సంవత్సరంలో డీడీఎస్‌–కేవీకేలో సుమారు 2వేల మట్టి శాంపిళ్లను విశ్లేషించి రైతులకు ఉచితంగా మట్టి ఆరోగ్య కార్డులను అందజేశారు. నాలుగేళ్లుగా ఈ కేంద్రం నిరంతరం మట్టి ఆరోగ్య కార్డుల విభాగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.

డీడీఎస్‌–కేవీకేకు 4 అవార్డులు1
1/1

డీడీఎస్‌–కేవీకేకు 4 అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement