
శిథిలమై.. మూతబడి శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ పాతభవనం
న్యూస్‌రీల్
హైదరాబాద్ శిల్పారామంలో యోగితా రాణా చేతుల మీదుగా అవార్డునందుకుంటున్న ఉపాధ్యాయులు డాక్టర్ సదయకుమార్, వాకిట శ్రీదేవి, విద్యాసాగర్
ఉత్తములకు పురస్కారం
సంగారెడ్డి ఎడ్యుకేషన్ /జిన్నారం: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు విద్యాసాగర్, డాక్టర్ సదయ్‌కుమార్, వాకిట శ్రీదేవిలను శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సన్మాంచి అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్‌లు అవార్డులు అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి విభాగంలో ఎంపికై న విద్యాసాగర్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా పలు పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక విభాగంలో ఎంపికై న డాక్టర్ సదయ్‌కుమార్ విద్యార్థులకు నూతన పద్ధతుల్లో బోధన చేయడంతోపాటు ఎన్‌సీసీ ద్వారా విద్యార్థులను సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు వాకిట శ్రీదేవి బోధనలో విద్యార్థులకు ఆసక్తికరంగా బోధన చేయడంతోపాటు పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నందుకుగాను ఉత్తమ అవార్డుకు ఎంపికై న సంగతి తెలిసిందే.

శిథిలమై.. మూతబడి శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ పాతభవనం

శిథిలమై.. మూతబడి శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ పాతభవనం

శిథిలమై.. మూతబడి శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ పాతభవనం