త్వరలో 8వేల పోస్టుల భర్తీ | - | Sakshi
Sakshi News home page

త్వరలో 8వేల పోస్టుల భర్తీ

Sep 6 2025 9:09 AM | Updated on Sep 6 2025 9:09 AM

త్వరల

త్వరలో 8వేల పోస్టుల భర్తీ

పేదలందరీకీ మెరుగైన ఉచిత వైద్యం అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మంత్రి దామోదర రాజనర్సింహ పలు అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

నారాయణఖేడ్‌: పేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఎంపీ సురేష్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి రూ.1.15 కోట్లతో నారాయణఖేడ్‌ మండలం జూకల్‌ శివారులోని కన్వెన్షహాలు విస్తరణ, సదుపాయాలు, రూ.3.9 కోట్లతో అర్బన్‌ పార్కు ఏర్పాటు, ఖేడ్‌ చుట్టూ సీసీతో రింగ్‌రోడ్డు, మనూరు మండలం డోవూరు నుంచి ఎల్గొయి, అతిమ్యాల్‌ మీదుగా ఎన్‌.జి. హుక్రానా వరకు రూ.6 కోట్లతో తారురోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైనా వైద్య అందేలా చర్యలు చేపట్టామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో 9 వేల పోస్టులను భర్తీ చేశామని, మరో 8 వేల పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పోస్టుల భర్తీతో కార్పొరేట్‌ అసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. అర్బన్‌ పార్కు అటవీ సంరక్షణతోపాటు జనాలకు ఆహ్లాదం, ఆరోగ్యం కోసం దోహదపడుతుందన్నారు. ఎంపీ సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ఖేడ్‌ను విద్య, వైద్యరంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ నల్లవాగు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్‌, సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, డీఎఫ్‌ శ్రీధర్‌రావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగనిర్మల, మున్సిపల్‌ కమిషనరు జగ్జీవన్‌ పాల్గొన్నారు.

విద్యా, వైద్యరంగాలకు ప్రాధాన్యం

ప్రభుత్వం విద్యా, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని దామోదర తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులైన ఐదుగురిని, డివిజన్‌ స్థాయిలో ఎంపికై న 70 మందిని సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్‌

కల్హేర్‌(నారాయణఖేడ్‌): వైద్యరంగాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ భ్రష్టు పట్టించిందని మంత్రి విమర్శించారు. సిర్గాపూర్‌లో పీహెచ్‌సీ భవనాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్పత్రుల్లో వసతులు కలిపించామనితెలిపారు.

జగ్గన్నా.. వైద్యసేవలను పర్యవేక్షించండి

సంగారెడ్డి: జిల్లా కేంద్ర ఆస్పత్రి, మెడికల్‌ కళాశాలను పది రోజులకోసారి సందర్శించి వైద్యసేవలను పర్యవేక్షించాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డికి మంత్రి దామోదర సూచించారు. ఇంకా ఏమైనా అవసరాలుంటే నివేదిక ఇవ్వాలన్నారు. వైద్య కళాశాల, నూతన భవనాలు, హాస్టల్‌ భవనం, క్రిటికల్‌ కేర్‌ యూనిట్లు వంటి వాటిని పరిశీలించాలనిసూచించారు.

త్వరలో 8వేల పోస్టుల భర్తీ 1
1/1

త్వరలో 8వేల పోస్టుల భర్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement