
మౌలిక వసతులేవీ?
తూప్రాన్ మున్సిపల్‌గా మారినా.. అవే సమస్యలు
● పట్టించుకోని అధికారులు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మున్సిపల్ ఆదాయం..
మున్సిపాలిటీకి ప్రతి ఏటా సుమారు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఇంటి పన్నులు, లైసెన్స్‌ల రూపంలో రూ.1.75 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో రూ.50 లక్షల వరకు వస్తాయి.
తూప్రాన్: శరవేగంగా విస్తరిస్తున్న పట్టణంలో నిర్మాణాలు జోరందుకున్నా మౌలిక వసతుల కల్పన కలగానే మిగిలింది. తూప్రాన్ మేజర్ పంచాయతీ నుంచి మున్సిపల్‌గా మారి ఏళ్లు గడుస్తున్నా సౌకర్యాలు మాత్రం అధికారులు కల్పించడం లేదని పట్టణ వాసులు వాపోతున్నారు. మున్సిపల్‌గా మారితే పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ, సీసీరోడ్లు, అంతర్గత డ్రైనేజీలు లేకపోవడంతోపాటు అస్తవ్యస్త పారిశుద్ధ్యం, పారుతున్న మురుగునీరు తదితర కాలనీల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలు మార్లు పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు.
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలో జనాభా– 22,148 మంది ఉండగా, ఇందులో మహిళలు– 11,154, పరుషులు–10,994 మంది ఉన్నారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణంలో జనాభాకు తగ్గట్లు అధికారులు వసతులు కల్పించడం లేదు. మున్సిపాలిటీలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ, అసంపూర్ణ పారిశుద్ధ్యం, సీసీరోడ్లు తదితర మౌలిక వసతులు లేని కారణంగా నిత్యం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో అక్కడక్కడ మురుగునీరు నిలిచి దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిపాలన పరంగా అధికారులు, సిబ్బందిని నియమించకపోవడం గమనార్హం. మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని సాయినగర్, విద్యానగర్, నాగార్జున కాలనీ, ఎస్సీ కాలనీ, కిందిబస్తీ, బీడీ కార్మికుల కాలనీ తదితర కాలనీల్లోని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు సమస్యలపై దృష్టి సారించి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
నిధుల కొరత కారణంగా పట్టణంలో మౌలిక వసతులు కల్పన విషయంలో జాప్యం నెలకొంది. త్వరలోనే మున్సిపల్‌కు టీయుఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.15 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. ఈ నిధులతో పట్టణంలోని 16 వార్డుల్లో నెలకొన్న సమస్యలను షరిష్కరిస్తాం. ప్రస్తుతం పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం.. కార్మికుల వేతనాలు, తదితర పనులకే సరిపోతుంది. –పాతూరి గణేశ్‌రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, తూప్రాన్

మౌలిక వసతులేవీ?

మౌలిక వసతులేవీ?