
‘పోచారం’ వద్ద తాత్కాలిక మరమ్మతులు
పోచారం డ్యామ్ దిగువన ఉన్న బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు నిర్మిస్తున్న అధికారులు
పొంగిపొర్లుతున్న పోచారం అలుగు
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ వరద ఉధృతికి దిగువన ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయి మెదక్– బోధన్ రోడ్డు రవాణా సదుపాయం నిలిచిపోయింది. మూడు రోజులుగా వరద ఉధృతి ఎక్కువగా ఉండగా ఆదివారం తగ్గి అవతలి వైపు ఉన్న బ్రిడ్జిపై వరకు అధికారులు టిప్పర్లతో మట్టిని పోసి రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు ఎల్లారెడ్డి, బోధన్, మెదక్ ప్రజలు ఈ రోడ్డు ద్వారానే వెళ్తారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసే దిశగా అధికారులు శ్రమిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలతో దిగువన ఉన్న పోచారం డ్యామ్, దూప్‌సింగ్ తండాలకు రాకపోకలకు అంతరాయం కలుగడంతో పాటు నాలుగు రోజులుగా వరద ఉధృతి కొనసాగింది. ఆదివారం కొంత మేర తగ్గడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయడంలో నిమగ్నమయ్యారు.

‘పోచారం’ వద్ద తాత్కాలిక మరమ్మతులు