
విధి నిర్వహణలో అప్రమత్తం
సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ సిబ్బందికి శనివారం వీక్లి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోశ్ మాట్లాడుతూ..శారీరక దారుఢ్యం కోసం ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు అధికారులు ఎలాంటి పరిస్థితులలోనైనా స్పందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వినాయక నిమజ్జనం, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేవిధంగా తగిన బందోబస్తు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, తదితరులు ఉన్నారు.
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్