
అన్ని రంగాల్లో ముందుండాలి
బహుమతులు అందజేస్తున్న లలిత కుమారి
నారాయణఖేడ్: ఆడ పిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా సీ్త్ర శిశు వయోవృద్ధుల సంక్షేమ అధికారి లలిత కుమారి పేర్కొన్నారు. నిజాంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం ‘బేటీ బచావో, బేటీ పడావో’కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆడ పిల్లలు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..పోక్సో చట్టం, షీ టీమ్ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీడీపీవో సుజాత, ఎంపీడీవో సంగ్రాం, ఏసీడీపీపీవో సుశీల, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం కోఆర్డినేటర్ పల్లవి, తహశీల్దార్ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ పీడీ లలిత కుమారి